ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3 లక్షల నగదును నిజాయతీగా తిరిగి అప్పగించిన కండక్టర్ సరితపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హజ్ యాత్రకు బయలుదేరిన ఓ ప్రయాణికుడు తన వెంట తీసుకెళ్తున్న నగదు బ్యాగ్‌ను ఆర్టీసీ బస్సులోనే మర్చిపోయారు.
బస్సు తనిఖీ చేసే సమయంలో కండక్టర్ సరితకు ఆ బ్యాగ్ కనిపించింది. అందులో సుమారు రూ.3 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించిన ఆమె.. దానిని భద్రంగా ఉంచి సంబంధిత ప్రయాణికుడికి తిరిగి అందజేశారు. దీంతో ప్రయాణికుడు ఊపిరి పీల్చుకున్నారు.
నగదును తన సొంత సొమ్ములా భావించకుండా నిజాయతీగా యజమానికి అప్పగించిన కండక్టర్ సరితను మంత్రి అజహరుద్దీన్ అభినందించారు. ఆమె చూపిన మానవత్వం, నిజాయతీ సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు డిపో అధికారులు కూడా సరితను ప్రత్యేకంగా అభినందించారు. బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ విలువైన నగదును సురక్షితంగా తిరిగి అప్పగించడం పట్ల ఆమెపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
also read: దుబాయ్ లో మలయాళీ సింగర్ నిసార్ వయనాడ్ మృతి..
