-ప్రతిపక్ష బెంచ్ స్థాయి దూకుడు
-విపక్షాలకు ధీటైన సమాధానం
-సిరిసిల్ల, గజ్వేలులో భారీ బహిరంగ సభలు
-విపక్షాలకు అక్కడి నుంచే సవాల్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :-
తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచారు. మళ్లీ తన పాత పదును, దూకుడును ప్రారంభించారు. రాజకీయంగా సవాళ్లు కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగా గులాబీ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా ఉన్న సిరిసిల్ల, గజ్వేల్ వంటి స్థానాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కెసిఆర్,, కేటీఆర్ సొంత నియోజకవర్గాల్లోనే సభలు పెట్టి సవాల్ విసరడం ద్వారా విపక్షాల దాడికి గట్టి కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ప్రకటించారు.
అప్పట్లో చాలా దూకుడు..
కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో రాజకీయ దూకుడుతో అధికార పార్టీపై ఓ రేంజ్ లో విరుచుకు పడేవారు. ఇప్పుడు అదే స్థాయి బంచ్ మార్క్ దూకుడును ప్రదర్శించడం అంత సులువు కాదు. ఎందుకంటే అప్పుడు ఏ బాధ్యతలు ఉండేవి కావు. విమర్శలతో రాజకీయ వేడి పుట్టించేవారు. అప్పుడు కేవలం ఆయన ఒక రాజకీయ నాయకుడి మాత్రమే. ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పాలనాపరమైన సమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, గ్యారంటీల అమలు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి భారీ బాధ్యతలు ఆయన భుజాలపై ఉన్నాయి. ఒకవైపు పాలనను పరుగులు తీస్తూనే.. మరోవైపు పాత రేవంత్ లాగా రాజకీయంగా విరుచుకు పడడం కత్తి మీద సాము.
ఆ సమస్యలను అధిగమిస్తూ..
ఇప్పటికే అనేక సమస్యలు తెలంగాణ ప్రభుత్వానికి వెంటాడుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విపక్షాలు, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, హామీల అమలుపై వరుసగా వెళ్ళు వెతుకుతున్న నిరసనలకు రేవంత్ చాలా ఓర్పుగా సమాధానాలు ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వం స్థిరపడేందుకు, వ్యవస్థలను చక్కదిద్దేందుకు కొంత సమయం కావాలని ఆయన బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు సమస్యల కోసం రోడ్లు ఎక్కే వారిని శాంతింప చేస్తూనే.. మరోవైపు విపక్షాలను కట్టడి చేయడం రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. ఈ పొలిటికల్ బ్యాలెన్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది చూడాలి.
