జిల్లాలోని అమ్రాబాద్‌లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో బురాన్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో అతడి భార్య, కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తల్లి, కుమారుడు కలిసి బురాన్‌ను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించగా మృతదేహం గోనెసంచిలో కనిపించింది.
మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, నిందితుల ఆచూకీపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
also read: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సూసైడ్ నోట్
