Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్: లెక్కలు చూపకపోతే మూడేళ్ల జైలు, పదవి రద్దు!

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రూల్స్: లెక్కలు చూపకపోతే మూడేళ్ల జైలు, పదవి రద్దు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నూతన నిబంధనలను జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోపు సంబంధిత మున్సిపల్ కమిషనర్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఒకవేళ నిర్ణీత గడువులోగా లెక్కలు సమర్పించకపోతే సదరు అభ్యర్థులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తారు. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఈ నిబంధన పాటించకపోతే వారి పదవిని తక్షణమే రద్దు చేస్తారు.కాగా, అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయవచ్చనే వ్యయ పరిమితిపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక పూర్తి స్పష్టత రానుంది. ఈ నిబంధనల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సెన్సార్ బోర్డుపై ఆర్. నారాయణమూర్తి తీవ్ర ఆగ్రహం.. మంచి సినిమాలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. పలు రాష్ట్రాలకు ఏఐసీసీ నూతన బాధ్యులు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు