Homeక్రైమ్రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌

రూ.30 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌

క్రైమ్ మిర్రర్ : పోడు రైతు భూమిలో ట్రెంచ్‌ పనులు చేపట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మధ్యవర్తి ద్వారా రూ.30 వేల నగదు స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రామానుజగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. కాచ్చనపల్లి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా, రామానుజగూడెం ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న బానోత్‌ రవికుమార్‌ ఓ పోడు రైతు భూమిలో ట్రెంచ్‌ కొట్టకుండా ఉండేందుకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. అధికారికి బదులుగా మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సాదిక్‌ తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌ ఆధ్వర్యంలోని బృందం దాడి చేసి నగదును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ బానోత్‌ రవికుమార్‌తో పాటు మధ్యవర్తి సాదిక్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖకు సంబంధించి నమోదైన అవినీతి కేసుల్లో ఇది నాలుగో కేసు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
also read : విశాఖలో విషాదం.. నేవీ ఉద్యోగి భార్య మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు