క్రైమ్ మిర్రర్ : చదువుకున్న యువకుడు ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై అప్పులపాలై చివరకు దొంగతనాల బాట పట్టాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని నార్కట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాము ఎంబీఏ చదివి కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం, అనంతరం మార్కెటింగ్ రంగంలో పనిచేశాడు. ఆ తర్వాత ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోయి అప్పులు చేశాడు.
అప్పులను తీర్చేందుకు చోరీలు చేయాలని నిర్ణయించుకున్న రాము.. గ్రామాల్లో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లే కుటుంబాలను గమనించేవాడు. వారు ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో ఆ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని నగదు, బంగారు ఆభరణాలను అపహరించేవాడు. ఇటీవల జువ్విగూడెం గ్రామంలో గోగు పద్మ ఇంట్లో చోరీ జరగడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నార్కట్‌పల్లి, చిట్యాల, నల్లగొండ రూరల్, కట్టంగూర్, తిప్పర్తి పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 9 చోరీలకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 12 తులాల బంగారం, 16 తులాల వెండి, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన నార్కట్‌పల్లి సీఐ సురేష్, ఎస్సై విష్ణుమూర్తి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి అభినందించారు.
also read :ప్రసూతి సెలవులు తీసుకున్నారని హోదా తగ్గించొద్దు.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
