Homeక్రైమ్అంబర్‌పేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. వాట్సాప్‌లో స్నేహితులకు చివరి సమాచారం

అంబర్‌పేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. వాట్సాప్‌లో స్నేహితులకు చివరి సమాచారం

నగరంలోని అంబర్‌పేట్ తిరుమలనగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. నిభాష్ (25) అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యకు ముందు నిభాష్ తన స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా తాను చనిపోతున్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన తిరుమలనగర్‌లోని ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిభాష్ మృతి చెందినట్లు గుర్తించారు.

ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు.

ప్రాథమికంగా ప్రేమ వ్యవహారంలో ఎదురైన సమస్యల కారణంగానే నిభాష్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిభాష్ వ్యక్తిగత పరిస్థితులు, వాట్సాప్ సందేశాలు తదితర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

also read: సాయిరాం నగర్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్‌లు దగ్ధం

తాజావార్తలు