Homeక్రైమ్కృష్ణపట్నం కాల్వలో గుర్తుతెలియని మృతదేహం.. ముత్తుకూరులో కలకలం

కృష్ణపట్నం కాల్వలో గుర్తుతెలియని మృతదేహం.. ముత్తుకూరులో కలకలం

ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం కాల్వలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కాల్వలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కాల్వ నుంచి వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు, అతడు కాల్వలోకి ఎలా వచ్చాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి గుర్తింపు, మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

also read: విషాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ముగ్గురిని ఢీకొట్టిన రైలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు