టాలీవుడ్ కింగ్ నాగార్జున, తమిళ స్టార్ హీరో సూర్య ఒకే సినిమాలో కనిపించనున్నారా? ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్య హీరోగా దర్శకుడు హెచ్. వినోత్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రానికి తాత్కాలికంగా ‘సూర్య 49’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో నాగార్జునను ప్రతినాయకుడి పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.
సినిమా కథ, తన పాత్ర నచ్చడంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా సూర్య పాత్రకు సమానమైన స్థాయిలో ఉండేలా విలన్ క్యారెక్టర్‌ను దర్శకుడు హెచ్. వినోత్ ప్రత్యేకంగా రూపొందించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక సూర్య, నాగార్జున ఇద్దరూ స్క్రీన్‌పై తలపడితే సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ప్రస్తుతం ‘సూర్య 49’ ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారనే విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్త నిజమా కాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
సూర్యకు ఎదురుగా నాగార్జున నిజంగానే విలన్‌గా కనిపిస్తే.. ఈ క్రేజీ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.
also read: జానీ మాస్టర్ కుటుంబానికి షాక్.. డ్యాన్సర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా సుమలత తొలగింపు?
