నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. సినిమాలోని రెండో పాట ‘యేష నాగుల’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.
ఈ పాటను సాధారణంగా విడుదల చేయకుండా, ముందుగా అమెరికాలోని డల్లాస్‌లో జరగనున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో లైవ్‌గా ప్రదర్శించనున్నారు. ఆగస్టు 28 రాత్రి జరిగే ఈ ప్రత్యేక ప్రదర్శన తర్వాత, ఆగస్టు 29న ‘యేష నాగుల’ సాంగ్‌ను అన్ని ప్రధాన డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు.
మాస్ బీట్తో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం రాశారు. జంగి రెడ్డి, సందీప్ కుమార్ గానం అందించగా.. సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సినిమాలోని ప్రధాన నటీనటులపై ఈ పాటను చిత్రీకరించినట్లు సమాచారం.
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన సినిమా ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరిగాయి. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
also read: సరిహద్దుల్లో సోదర బంధం.. జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ ఆడబిడ్డలు
