హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇజ్జత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బి. సునీతా నాయక్ (32), ధర్మేంద్ర కుమార్ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. గత ఆరేళ్లుగా ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే తమకు సంతానం కలగలేదనే కారణంతో ధర్మేంద్ర కుమార్ మరో మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం.
ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీతా నాయక్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ధర్మేంద్ర కుమార్.. భార్య విగతజీవిగా ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సునీత ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
also read: ‘ఇరుముడి’పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్
