Homeసినిమాజాన్వీ కపూర్‌ పెళ్లి వార్తల్లో ట్విస్ట్.. ఇషాన్‌ కట్టర్‌తో వివాహం నిజం కాదట!

జాన్వీ కపూర్‌ పెళ్లి వార్తల్లో ట్విస్ట్.. ఇషాన్‌ కట్టర్‌తో వివాహం నిజం కాదట!

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ పెళ్లి చేసుకున్నారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. హీరో ఇషాన్‌ కట్టర్‌తో కలిసి ఆమె పెళ్లి దుస్తుల్లో కనిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో.. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా స్పష్టమైంది. జాన్వీ కపూర్‌, ఇషాన్‌ కట్టర్‌ పెళ్లి బట్టల్లో కనిపించిన దృశ్యాలు నిజమైన వివాహానికి సంబంధించినవి కావని వెల్లడైంది. ‘KALKI Bride & Groom Couture ’26’ బ్రాండ్‌ కోసం నిర్వహించిన ప్రమోషనల్‌ షూట్‌లో భాగంగానే వీరిద్దరూ పెళ్లి దుస్తుల్లో కనిపించినట్లు సంస్థ స్పష్టం చేసింది.

షూట్‌లో భాగంగా జాన్వీ, ఇషాన్‌ వధూవరుల గెటప్‌లో కనిపించడంతో.. సోషల్‌ మీడియాలో చూసిన పలువురు వాటిని నిజమైన పెళ్లి ఫొటోలుగా భావించారు. దీంతో వీరి వివాహంపై ఒక్కసారిగా రూమర్స్‌ మొదలయ్యాయి.

ఈ ప్రచారంపై జాన్వీ కపూర్‌ కూడా స్పందించినట్లు సమాచారం. వైరల్‌ అవుతున్న ఫొటోలు, వీడియోలను చూసి వదంతులను నమ్మవద్దని ఆమె అభిమానులను కోరారు. దీంతో జాన్వీ కపూర్‌, ఇషాన్‌ కట్టర్‌ వివాహం జరిగిందనే ప్రచారానికి తెరపడింది.

ఇప్పటివరకు వైరల్‌ అయిన పెళ్లి ఫొటోలు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కాకుండా.. ఫ్యాషన్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా రూపొందించినవేనని స్పష్టమైంది.

also read: కమల్ హాసన్‌తో విడిపోవడంపై గౌతమి సంచలన వ్యాఖ్యలు.. ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు