Homeక్రైమ్సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం...! ఆరుగురిని మింగేసిన అతివేగం...

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం…! ఆరుగురిని మింగేసిన అతివేగం…

సూర్యాపేట, క్రైమ్ మిర్రర్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి 65పై కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచివున్న కంటైనర్‌లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, 20 మందికిపైగా సీరియ‌స్‌గా ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం.బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సుమారు 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముందు ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచిపోయిన, ఇనుప రాడ్లు లేదా లోహ సామగ్రితో ఉన్న లారీని బస్సు వేగంగా ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు…

Also Read: కర్ణాటకలో వందేమాతరం రెండు చరణాలే.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇతర ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రారంభ నివేదికల్లో పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Also Read:నేపాల్‌లో వరద విలయం.. 1,000 మంది గల్లంతు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు