క్రైమ్ మిర్రర్ : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన భజనలు, కీర్తనలు చేస్తున్న భక్తులపైకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లా పిప్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కటైయా గోత్ చౌక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బజరంగ్‌బలి ఆలయం వద్ద ఝులన్ ఉత్సవం సందర్భంగా భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అదే సమయంలో పిప్రా వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సుపాల్ సదర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో సమీపంలోని ఓ గ్యారేజీని కూడా కారు ఢీకొన్నట్లు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు. వాహనం యజమాని వివరాలను గుర్తించే పనితో పాటు పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ઘટનపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. యూట్యూబర్, ఆమె తల్లి మృతి
