Homeక్రైమ్మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్

క్రైమ్ మిర్రర్ : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసులో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్ అయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు విషయంలో జాప్యం జరిగిందన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ముత్తు యాదవ్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. సుమంత్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న సుమంత్ కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా సుమంత్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read : ప్రేమ గెలిచింది.. ట్రాన్స్‌జెండర్ మహిళను పెళ్లాడిన ఆలయ అర్చకుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు