క్రైమ్ మిర్రర్ : తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ రెండు వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. 2013లో తనపై అత్యాచారం చేశారంటూ తేజ్‌పాల్ సహోద్యోగిని చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఒక బెంచ్ 2021లో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ తేజ్‌పాల్‌కు పదేళ్ల కారాగార శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఆయనకు విధించిన శిక్షను మరింత పెంచాలని గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. శిక్షపై బాంబే హైకోర్టు ఇప్పటికే స్టే విధించిందని, ఈ నేపథ్యంలో మళ్లీ లొంగిపోవాలని ఆదేశించడం సముచితం కాదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే కపిల్ సిబల్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ధర్మాసనం తరుణ్ తేజ్‌పాల్ రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
also read : స్నాప్‌చాట్‌లో పరిచయం…! రూ. కోటిన్నర స్వాహా…
