Homeక్రీడలునైట్‌క్లబ్ ఘర్షణలో బ్రైడన్ కార్సే.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

నైట్‌క్లబ్ ఘర్షణలో బ్రైడన్ కార్సే.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సేకు సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి డర్బీలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘర్షణలో కార్సే ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చేతులకు బేడీలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన సమయంలో డర్హమ్ జట్టు ఆటగాడు మాథ్యూ పాట్స్ కూడా అదే క్లబ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఘర్షణకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనలో కార్సే పాత్రపై స్పష్టమైన వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.

ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) స్పందించింది. డర్బీ క్లబ్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించింది. మరోవైపు పోలీసులు కార్సేను తొలుత అదుపులోకి తీసుకున్నప్పటికీ.. అనంతరం విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌తో జరగనున్న రెండో టెస్టుకు బ్రైడన్ కార్సే ఇంగ్లండ్ జట్టులో కొనసాగుతున్నాడు. నైట్‌క్లబ్ ఘటన నేపథ్యంలో అతడి విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు ఉంటాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

also read: తిరుపతిలో మైనర్ బాలికపై బ్లేడ్ దాడి.. గతంలో యాసిడ్ దాడి కలకలం

తాజావార్తలు