Homeక్రైమ్విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి

విజయనగరం జిల్లాలో పోలీసు వాహనం బోల్తా.. కానిస్టేబుల్ మృతి

విజయనగరం జిల్లాలో ఆదివారం పోలీసు వాహనం ప్రమాదానికి గురైంది. క్రైమ్‌ కేసు విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం బ్రేకులు పనిచేయకపోవడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ రమణ (45)తో పాటు ఎస్‌ఐ, డ్రైవర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ఘటన అనంతరం క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ రమణ మృతి చెందారు.

ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వాహనం బ్రేకులు ఎందుకు పనిచేయలేదనే అంశంపై కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం.

also read: విషాదం… ఎనికేపల్లి చెరువులో రెండున్నరేళ్ల బాలుడి మృతదేహం

తాజావార్తలు