Homeక్రైమ్మాదాపూర్‌లో విషాదం.. రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన కారు

మాదాపూర్‌లో విషాదం.. రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన కారు

మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఈ నెల 16న ఇనార్బిట్‌ మాల్‌ సమీపంలో చోటుచేసుకుంది.

లైఫ్‌స్టైల్‌ స్టోర్‌లో పనిచేస్తున్న భారతిముఖి అనే యువతి.. ఓ వ్యక్తితో కలిసి భోజనం చేసి తిరిగి వెళ్తుండగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు తలకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ సంజుస్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: కైలాశ్ మానస సరోవర్ యాత్రకు బ్రేక్.. కొండచరియలతో కూలిన కీలక వంతెన

తాజావార్తలు