Homeతెలంగాణతగ్గేదేలే అంటున్న పోచారం...! కేసీఆర్ మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నానంటూ పున‌రుద్ఘాట‌న‌...

తగ్గేదేలే అంటున్న పోచారం…! కేసీఆర్ మాట‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నానంటూ పున‌రుద్ఘాట‌న‌…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. కెసిఆర్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. అన్నం పెట్టిన వాడిని మరిచిపోతామా? అలా మరిచిపోతే పుట్టగతులు ఉండవని కెసిఆర్ ను ఉద్దేశించి మరోసారి వ్యాఖ్యానించారు పోచారం. నేను ఉన్న విషయాన్ని మొన్న చెప్పాను.. నా ప్రజలే నాకు ముఖ్యం.. వారి కోసమే నా జీవితం అని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాను తప్ప నా స్వార్థం కోసం ఏదీ చేయను.. ఏదైనా పోరాటం చేసే సాధించుకుంటా కానీ తలవంచే రాజకీయ నాయకుడిని కాదు అని తేల్చి చెప్పారు. అయితే పోచారం నోట తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను అనే మాట రావడం లేదు. కేవలం సీఎంను కలిశాననే మాట వస్తోంది. దీంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే…

Also Read: గాలేలో అగ్నిపరీక్ష: వాతావరణం, కూకాబుర్ర బంతే భారత్‌కు అసలు సవాల్!

కొద్ది రోజుల కిందట గులాబీ పార్టీని ఫిరాయించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో భౌతికంగా చేరలేదు కానీ.. గులాబీ పార్టీకి మాత్రం గుడ్ బై చెప్పినట్టు కనిపించారు. అయితే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలిశానని.. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని.. నిధులు రావడంలేదని.. బిల్లులు చెల్లింపులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి చెందిందని తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా కలవరం ప్రారంభం అయింది. తిరిగి గులాబీ పార్టీలో చేరేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడిచింది. అయితే రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకే తాను కట్టుబడి ఉన్నానని మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో.. ఆయన స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది.

పూర్తి డిఫెన్స్ లో…

Also Read:ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. ప్రయాణికుడి బ్యాగులో కోతి పుర్రె!

పోచారం శ్రీనివాస్ రెడ్డి డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ ను కలిసేటప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపు పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల కొరత.. పెండింగ్ బిల్లుల వల్ల పనులు నిలిచిపోవడంపై అసంతృప్తి వెళ్ళగకుతున్నారు. తన ఆత్మ గౌరవాన్ని, నియోజకవర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పోచారం తేల్చి చెప్పారు. ఇందులో దాచడానికి ఏమీ లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోచారం తీరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లోనూ.. అధికార కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పోచారం తిరిగి భారత రాష్ట్ర సమితిలోకి చేరేందుకు కార్పెట్ రెడీ చేసుకుంటున్నారని కొంతమంది.. కాంగ్రెస్పై ఒత్తిడి తెచ్చి బిల్లులు విడుదల చేయించుకోవడానికి ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని మరికొందరు అనుమానిస్తున్నారు.

తీవ్ర నిర్ణయం దిశగా…

Also Read:ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌.. 2- 3 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన

పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మూడుసార్లు ఆయన కేసీఆర్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. గౌరవప్రదమైన పదవులు దక్కించుకున్నారు. చివరిసారిగా రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ గా కూడా వ్యవహరించారు. అటువంటిది సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అన్నవారు ఉన్నారు. మున్ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు