Homeతెలంగాణజనసేనలోకి రాజా సింగ్!

జనసేనలోకి రాజా సింగ్!

-దాదాపు మూసుకుపోతున్న బిజెపి తలుపులు
-ప్రత్యామ్నాయంగా పవన్ పార్టీ
-తెర వెనుక చేరికకు రంగం సిద్ధం
క్రైమ్ మిర్రర్,తెలంగాణ బ్యూరో
:- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జనసేనలో చేరుతారా? బిజెపిలోకి రీఎంట్రీ కుదరకపోతే అ

    దే పని చేయనున్నారా? ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ బిజెపి నాయకత్వాన్ని ఆశించిన రాజాసింగ్.. అది దక్కకపోయేసరికి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన చర్యలతో విసిగి వేసారి పోయిన పార్టీ హై కమాండ్ రాజీనామాను ఆమోదించింది. అయితే గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ద్వారా బిజెపిలో రీఎంట్రీకి రాజాసింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్క్ అవుట్ కావడం లేదు. ఈ తరుణంలో రాజాసింగ్ జనసేన లో చేరేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    జనసేన పై కీలక వ్యాఖ్యలు..
    రెండు రోజుల కిందట రాజాసింగ్ జనసేన పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేనకు భవిష్యత్తు ఉందంటూ వ్యాఖ్యానించారు. యూత్ లో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన క్రేజ్ ఉందని పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలని సూచించారు. కాంగ్రెస్ తో పాటు భారత రాష్ట్ర సమితికి జనసేన ప్రత్యామ్నాయం అని తేల్చి చెప్పారు. అయితే ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణలో బిజెపి ఒంటరి పోరాటంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలంగాణలో జనసేనకు భవిష్యత్తు ఉందని చెప్పడం ద్వారా సంచలనానికి తెరలేరు ఒకప్పటి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ కూడా జనసేన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    హ్యాట్రిక్ ఎమ్మెల్యే..
    గోషామహల్ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు రాజాసింగ్. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. తరువాత బిజెపిలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018లో సైతం రెండోసారి గెలిచి రికార్డు సృష్టించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రతిసారి పార్టీతో వివాదం పెట్టుకోవడం రివాజుగా మారింది. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విభేదిస్తూ వ్యాఖ్యలు చేస్తే రాజాసింగ్ విషయంలో బిజెపి హై కమాండ్ సీరియస్ గా ఉంది. పలుమార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం.. తర్వాత హై కమాండ్ ఎత్తివేయడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి ఆయనకు బిజెపిలో చేరిక కష్టమేనని తెలుస్తోంది. అందుకే రాజాసింగ్ జనసేనలో చేరికకు రంగం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు