ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటావా జిల్లాలోని భరతనా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సియారామ్ (75) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో రైలు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం వృద్ధుడి మృతదేహం రైలు ఇంజిన్‌లో చిక్కుకుంది. దీంతో రైలు ముందుకు కదులుతున్న సమయంలో మృతదేహం సుమారు ఒక కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పట్టాలు దాటే సమయంలో వృద్ధుడు రైలును గమనించలేకపోయారా? లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
also read: విద్యుత్ పోల్ అమర్చుతుండగా విషాదం.. 5 సెకన్లలోనే కార్మికుడి మృతి
