Homeక్రైమ్కర్ణాటకలో ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం.. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడేందుకు యత్నం

కర్ణాటకలో ‘చెడ్డీ గ్యాంగ్’ కలకలం.. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడేందుకు యత్నం

కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా కుంబారనహళ్లి పరిధిలో అనుమానిత దొంగల ముఠా హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఓ ప్రైవేట్ లేఅవుట్‌లోకి ప్రవేశించి ఇళ్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ముఠా సభ్యులు కొన్ని ఇళ్ల కాంపౌండ్ గేట్లను తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే వారి కదలికలను గమనించిన ఓ మహిళ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో చోరీ యత్నం విఫలమైంది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు స్థానికులకు సూచించారు. ఇళ్లకు తాళాలు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు, పరిసరాల్లో సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

also read: కొలంబియాలో భీకర భూకంపం.. 132 మంది మృతి – ఈక్వెడార్ వరకూ ప్రభావం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు