Homeసినిమావిజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాలో టాబు రోల్ ఇదే..!

విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాలో టాబు రోల్ ఇదే..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ స్లమ్ డాగ్ పై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. కొంతకాలంగా పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా టబు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.తాజా పోస్టర్‌లో టబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. సినిమాలో ఆమె గౌరి హెగ్డే అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. టబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ సీక్రెట్‌గా ఉంచారు. దీంతో సినిమాలో టబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆగస్టు 10న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ గ్లింప్స్‌తో ఆమె పాత్ర స్వభావంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీనియర్ నటి టబు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్…!

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ కావడంతో ‘స్లమ్ డాగ్’పై మొదటి నుంచే మంచి బజ్ ఉంది. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్‌కు విజయ్ సేతుపతి నటన తోడవడంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. నిర్మాణంలో కొంత ఆలస్యం కారణంగా సినిమా నుంచి అప్‌డేట్స్ తగ్గిపోయినప్పటికీ.. ఇప్పుడు మేకర్స్ మళ్లీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రాన్ని జేబీ మోషన్ పిక్చర్స్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టబు గ్లింప్స్‌తో మొదలైన కొత్త ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా త్వరలో మరిన్ని కీలక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

దక్షిణాన హై స్పీడ్ రైలు కారిడార్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు