Homeజాతీయంబాక్సాఫీసును షేక్ చేస్తున్న స్పైడ‌ర్‌మ్యాన్‌...! 12వేల కోట్ల కోట్ల క‌లెక్ష‌న్‌తో స‌రికొత్త రికార్డు....

బాక్సాఫీసును షేక్ చేస్తున్న స్పైడ‌ర్‌మ్యాన్‌…! 12వేల కోట్ల కోట్ల క‌లెక్ష‌న్‌తో స‌రికొత్త రికార్డు….

ముంబై, క్రైమ్‌మిర్ర‌ర్‌: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వీక్ డేస్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా $1.31 బిలియన్ డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.12,300 కోట్లకు పైగా కలెక్షన్స్) పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇప్పటివరకూ రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.థియేట్రికల్ రన్ తర్వాత స్పైడర్ మ్యాన్ లేటెస్ట్ మూవీ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు సహా ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ జియో హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. లేటెస్ట్ మూవీ ఈ ఓటీటీలోనూ వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Also Read:అరుణాచల్‌పై ఆందోళన.. ‘చైనా ఆక్రమణలు పెరుగుతున్నాయి’ అంటూ యువకుడి వీడియో వైరల్

ఈ మూవీకి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించగా… టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించాడు. అతనికి జోడీగా జెండయా నటించారు. జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్నాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలకపాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఎవరనేది ప్రపంచం మర్చిపోవడంతో స్నేహితులు, ప్రియురాలు అందరికీ దూరంగా ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. న్యూయార్క్‌లో జరగబోయే నేరాలను తన ట్రాకింగ్ సిస్టమ్‌తో ముందే పసిగట్టి వాటిని అడ్డుకుంటూ నేరస్థులను చట్టానికి అప్పగిస్తూ… ఓ ఫ్రెండ్లీ స్పైడర్ మ్యాన్‌గా వ్యవహరిస్తుంటాడు. సరిగ్గా అదే టైంలో స్పైడర్ మ్యాన్ శరీరంలో ఊహించని మార్పులు జరుగుతుంటాయి.హార్మోన్ల ప్రతిస్పందన తీవ్రంగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. మరోవైపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్‌పై ఓ అదృశ్య శక్తి దాడులు చేస్తూ వీ మ్యాక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు డీసీసీపై దాడి చేస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? వి మ్యాక్స్ అంటే ఏంటి? ఆ శక్తిని ఎదుర్కొనేందుకు స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? తన ప్రియురాలికి పీటర్ పార్కర్ ఎలా గుర్తొచ్చాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read:లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు