Homeఅంతర్జాతీయంచైనాలో టార్చ్ ఫెస్టివల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 16 మందికి గాయాలు

చైనాలో టార్చ్ ఫెస్టివల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 16 మందికి గాయాలు

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన టార్చ్ ఫెస్టివల్ వేడుకల్లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. జియాన్‌వెన్ ప్రాంతంలో కాగడాలు వెలిగించే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయిల్‌తో ఉన్న ఓ కంటెయినర్ ప్రమాదవశాత్తు కిందపడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

ఆ సమయంలో సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. మంటలు చుట్టుముట్టడంతో పలువురు అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. కొంతమంది మంటల్లో చిక్కుకోవడంతో సహాయం కోసం కేకలు వేస్తూ కనిపించడం కలచివేసింది.

ఈ ఘటనలో మొత్తం 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేడుకల్లో భద్రతా ఏర్పాట్లపై ఈ ప్రమాదం మరోసారి ఆందోళనకు దారితీసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

also read: దేవరకొండలో వీధి కుక్కల దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

తాజావార్తలు