Homeక్రైమ్చేవెళ్ల రెస్టారెంట్‌లో దాడి.. మద్యం తెచ్చివ్వలేదని మేనేజర్‌పై ఐదుగురి దౌర్జన్యం

చేవెళ్ల రెస్టారెంట్‌లో దాడి.. మద్యం తెచ్చివ్వలేదని మేనేజర్‌పై ఐదుగురి దౌర్జన్యం

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రెస్టారెంట్‌లో మేనేజర్‌పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని కోరగా.. రెస్టారెంట్ నిబంధనల ప్రకారం అందుకు అనుమతి లేదని మేనేజర్ నిరాకరించడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

చేవెళ్లలోని సాద్వి రెస్టారెంట్‌లో శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు మేనేజర్ చాకలి సుదర్శన్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనపై కర్రలతో దాడి చేసి, కాలితో తన్నినట్లు మేనేజర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రెస్టారెంట్ సిబ్బందిపైనా నిందితులు దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ మహిళకు కూడా గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా తామే పోలీసులమంటూ బెదిరింపులకు పాల్పడి, అసభ్య పదజాలంతో దూషించినట్లు సుదర్శన్ ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితులపై తీసుకోనున్న చర్యలపై పోలీసుల నుంచి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

also read: అమెరికా వైఖరి మారే వరకు హర్మూజ్‌ జలసంధి తెరవం : ఇరాన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు