Homeసినిమాయశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్‌

యశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్‌

క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్‌పై మృణాల్ స్పందించడంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఓ కేఫ్‌ నుంచి మృణాల్ ఠాకూర్, యశస్వి జైస్వాల్ వేర్వేరుగా బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ ఒకే ప్రదేశంలో కనిపించడంతో నెటిజన్లు వారి మధ్య ఏదో సంబంధం ఉందంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ ప్రచారం కాస్తా డేటింగ్ రూమర్స్‌గా మారిపోయింది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్‌పై మృణాల్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. బ్రో రిలాక్స్ అంటూ మొదలుపెట్టి, తనకు యశస్వి జైస్వాల్‌కు మధ్య ఎలాంటి డేటింగ్ సంబంధం లేదని స్పష్టం చేశారు. తన పక్కన యశస్వి ఎక్కడ కనిపించాడో చూపించాలంటూ ప్రశ్నించారు.

మహేశ్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి నుంచి రుద్ర మాస్ లుక్.. పోస్టర్లు చూస్తే గూస్‌బంప్సే!

అంతేకాకుండా ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. చదువుకున్నవారు కూడా ఇలాంటి నిరాధారమైన వదంతులను ఎలా నమ్ముతారో అర్థం కావడం లేదని అన్నారు. దేశంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి పెట్టకుండా ఇలాంటి వార్తలపై ఫోకస్ చేయడం సరికాదని మృణాల్ సూచించారు.మృణాల్‌కు డేటింగ్ రూమర్స్ కొత్తేమీ కాదు. గతంలో తమిళ హీరో ధనుష్‌తోనూ ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కూడా ఆమె వర్గాలు ఖండించాయి.తాజా వ్యవహారంలోనూ కేవలం ఒకే ప్రదేశంలో కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని నిర్ణయానికి రావడం సరికాదని మృణాల్ తన స్పందన ద్వారా స్పష్టం చేశారు. యశస్వి జైస్వాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని ఆమె క్లారిటీ ఇవ్వడంతో ఈ డేటింగ్ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.ఇక సినిమాల విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ సీతారామం, హాయ్ నాన్నా, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి.

దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు