క్రైమ్ మిర్రర్,సినిమా:- సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో మహేశ్ పోషిస్తున్న రుద్ర పాత్రకు సంబంధించిన రెండు పవర్‌ఫుల్ పోస్టర్లను రాజమౌళి విడుదల చేశారు.పోస్టర్లలో మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించారు. ఒక పోస్టర్‌లో అడవి నేపథ్యంలో సీరియస్‌గా కనిపిస్తుండగా, మరో పోస్టర్‌లో వెదురు తెప్పపై పడుకుని శత్రువుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా కనిపించారు. ఇప్పటివరకు మహేశ్‌ను చూడని విధంగా ఈ లుక్ ఉండటంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. పోస్టర్లు విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు
ఈ పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాజమౌళి.. రుద్రలోని మరో కోణాన్ని సూచించేలా ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. మహేశ్ బర్త్‌డే సందర్భంగా టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ఈ పోస్టర్లు ప్రత్యేక ట్రీట్‌గా మారాయి. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అభిమానులు పోస్టర్లను విపరీతంగా షేర్ చేస్తున్నారు.వారణాసి సినిమా టైమ్ ట్రావెల్, పురాణాలు, ఆస్టరాయిడ్ ముప్పు నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, ఆఫ్రికా అడవుల నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకు కథ సాగనుందని తెలుస్తోంది. ప్రాచీన రోమ్ నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందిస్తున్నారు. సినిమా నిర్మాణ విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.సుమారు రూ.1300-1500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ రుద్ర లుక్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా విడుదలకు ముందే వారణాసి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ వారం థియేటర్లలో సందడి.. విశ్వనాథ్ అండ్ సన్స్ నుంచి అగధ వరకు రిలీజ్ అయ్యే సినిమాలివే!
