Homeతెలంగాణకవితపై బిఆర్ఎస్ సైలెన్స్!

కవితపై బిఆర్ఎస్ సైలెన్స్!

-మౌనంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ ఆదేశం
-రెచ్చగొట్టే ప్రకటనలు వద్దు
-నాయకులకు స్పష్టమైన ఆదేశాలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 
కవిత విషయంలో గులాబీ పార్టీ సైలెన్స్ ఎందుకు పాటిస్తుంది? ఆమె విషయంలో ఎందుకు స్పందించడం లేదు? బిఆర్ఎస్ పై ఆమె విమర్శలు చేస్తున్నా చూసి చూడనట్టుగా ఎందుకు విడిచిపెడుతోంది? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే గులాబీ పార్టీ నేతలు కవితపై విమర్శలు చేసిన సందర్భాలు లేవు. కానీ అదే సమయంలో కవిత మాత్రం గులాబీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. అంత చేస్తున్న గులాబీ పార్టీ నేతల మౌనం వెనుక ఉన్న వ్యూహం అనేది ఏంటో అర్థం కావడం లేదు.

అధినేత ఆదేశాలు..
కవిత విషయంలో గులాబీ పార్టీ నేతలకు కేసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కవిత ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రెచ్చిపోవద్దని.. దానికి కౌంటర్లు ఇవ్వొద్దు అంటూ పార్టీ నాయకులందరినీ సూచించింది. కవితను మౌనంతోనే దెబ్బతీయాలన్నది ప్రణాళికగా అర్థమవుతోంది. కవితను రెచ్చగొట్టే కొద్ది ఆమె మరింత మాటలు దాడి చేసి.. తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తారని భావించిన భారత రాష్ట్ర సమితి నాయకత్వం.. సైలెంట్ గా ఉండడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్ని రకాల విమర్శలు ఎదురైనా పట్టించుకోవద్దని ఆదేశాలు నాయకత్వం నుంచి వచ్చినట్లు సమాచారం.

తొలినాళ్లలో విమర్శలు..
కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తొలినాళ్లలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో మాజీ మంత్రులపై కూడా ఆమె వ్యక్తిగత విమర్శలు చేశారు. నాడు జగదీశ్వర్ రెడ్డి తో పాటు పలువురు సీనియర్లు కవిత విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ప్రాణం ఉండగా తాను ఇక బిఆర్ఎస్ లోకి వెళ్ళనని కూడా తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీని ఏర్పాటు చేశారు.

ఫలించని మంత్రాంగం..
ప్రధానంగా కవిత గులాబీ పార్టీ పైనే ఫోకస్ చేశారు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆ చేరికలు లేవు. ఇతర పార్టీల నుంచి కూడా కవిత పార్టీలో చేరిన నాయకులు కనిపించడం లేదు. ఈ తరుణంలో అనవసరంగా ఆమెను హైలైట్ చేసి.. బలోపేతం చేయకూడదు అనేది కేసీఆర్ వ్యూహం. కవిత వ్యాఖ్యలతో సెంటిమెంటు మరింత ఎగసిపడి.. రాజకీయంగా తమకు లాభిస్తుంది అనేది కేసీఆర్ అంచనా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఆమె వ్యాఖ్యలు, విమర్శలు ఉంటే.. ఆమె వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ ఆలోచన. అందుకే కుమార్తె విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు కేసీఆర్.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు