Homeఆంధ్ర ప్రదేశ్టిడిపిలోకి దేవినేని అవినాష్?

టిడిపిలోకి దేవినేని అవినాష్?

  • వైసీపీలో ప్రాధాన్యం లేకపోవడంతో తెలుగుదేశం వైపు చూపు

  • కేసులు కొట్టివేస్తే పార్టీలో చేరుతానని లోకేష్ కు రాయబారం

  • సీనియర్లతో చంద్రబాబుపై ఒత్తిడి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిడిపి నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. కూటమి ఎమ్మెల్యేలతో విభేదాలతో కొంతమంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇటువంటి తరుణంలో టిడిపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల పై దృష్టి పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో వైసీపీ యువనేత దేవినేని అవినాష్ టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆయన టిడిపిలోని సీనియర్ల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. తన తండ్రి దేవినేని నెహ్రూ తో స్నేహం ఉన్న టిడిపి నేతల ద్వారా చంద్రబాబుతో పాటు లోకేష్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

  • టికెట్ నిరాకరణ…

దేవినేని అవినాష్ టిడిపి చూపు వెనుక జగన్మోహన్ రెడ్డి కారణం అని తెలుస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ విషయంలో అవినాష్ కు మొండిచేయి తప్పదు అనే ప్రచారం సాగుతోంది. అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అవినాష్ కోసం చాలా రకాల ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా మారిన కేసినేని నాని సైతం తూర్పు నియోజకవర్గం పైనే దృష్టి పెట్టారు. అయినా సరే అవినాష్ నెగ్గుకు రాలేకపోయారు. ఆ నియోజకవర్గంలో అవినాష్ పట్ల పెద్దగా సానుకూలత లేదు. అందుకే మార్పు చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతలా పరితపిస్తే తనను పక్కన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆవేదన అవినాష్ లో ఉంది. అందుకే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

కృష్ణా రాజకీయాల్లో ముద్ర..

విజయవాడ రాజకీయాల్లో దేవినేని కుటుంబాన్ని ప్రత్యేక స్థానం. అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూ రాజకీయాల్లో రాణించారు. కానీ ఆ వారసత్వాన్ని తీసుకున్న అవినాష్ తప్పుడు నిర్ణయాలతో అవకాశాలు చేజారాయి. అయితే దేవినేని నెహ్రూ మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుంచి నాలుగు సార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 1994 నుంచి 1996 వరకు మంత్రిగా పనిచేశారు. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన్ రావు పై పోటీ చేసి గెలిచారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున కుమారుడు దేవినేని అవినాష్ తో పోటీ చేయించారు. ఎన్నికల ఫలితాలు తర్వాత కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు.

  • ఎంతగానో ప్రాధాన్యం..

తెలుగుదేశం పార్టీలో చేరిన దేవినేని అవినాష్ ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఛాన్స్ కల్పించారు. ఇంతలోనే నెహ్రూ అనారోగ్యంతో మృతి చెందడంతో అవినాష్కు అండగా నిలిచారు. అలా 2019 ఎన్నికల్లో గుడివాడ టిక్కెట్ ఇచ్చారు కొడాలి నాని పై పోటీ చేసేందుకు. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు తనపై నమోదైన కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ తన భార్య ద్వారా లోకేష్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కేసులు కొట్టేస్తే తిరిగి టిడిపిలో చేరేందుకు సిద్ధం అని సీనియర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు