Homeజాతీయంఅలర్ట్: ఈ తప్పులు చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కావచ్చు, జాగ్రత్త!

అలర్ట్: ఈ తప్పులు చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ బ్యాన్ కావచ్చు, జాగ్రత్త!

క్రైమ్ మిర్రర్,జాతీయం:- ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్, వినియోగదారుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలను ఉల్లంఘించే అకౌంట్లపై ఉక్కుపాదం మోపుతోంది. కొన్ని అకౌంట్లను మెటా ‘అండర్ రివ్యూ’లో ఉంచి, 24 గంటల పాటు బ్లాక్ చేస్తోంది. కొన్నిసార్లు శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది. ఏయే కారణాల వల్ల వాట్సాప్ అకౌంట్లు బ్లాక్ అవుతాయో తెలుసుకుందాం:చట్టవిరుద్ధమైన, ద్వేషాన్ని రెచ్చగొట్టే, అసత్య ప్రచారాలు లేదా అశ్లీల కంటెంట్‌ను షేర్ చేయడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. హింసను ప్రేరేపించే సందేశాలు పంపినా చర్యలు తప్పవు.’GB WhatsApp’, ‘WhatsApp Plus’ లాంటి అనధికారిక వర్షన్లను వాడటం వల్ల డేటా భద్రత ఉండదు. వీటిని వాడటం వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన.ఒకే మెసేజ్‌ను పదే పదే గ్రూపుల్లో లేదా తెలియని వ్యక్తులకు పంపడం స్పామింగ్. ప్రమోషనల్ మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయడం మానుకోవాలి.తక్కువ సమయంలో ఎక్కువ మంది యూజర్లు మీ నంబర్‌ను బ్లాక్ చేసినా లేదా రిపోర్ట్ చేసినా, మీ అకౌంట్‌ను వాట్సాప్ అనుమానాస్పదంగా పరిగణించి బ్లాక్ చేయవచ్చు.బాట్స్ లేదా సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ఆటోమేటిక్‌గా వేలాది మెసేజ్‌లు పంపడం నిషేధం. దీనికోసం ‘వాట్సాప్ బిజినెస్ API’ ని ఉపయోగించాలి.ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది.

కాంగోలో ఎబోలా కల్లోలం: 1,700 దాటిన మృతుల సంఖ్య, తీవ్ర ఆందోళనలో ఆఫ్రికా దేశాలు!

ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పులు.. చార్టర్డ్ అకౌంటెంట్ బలవన్మరణం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు