మెదక్ జిల్లాకు చెందిన ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి, తనను అనాథనని నమ్మించి ఆ కుటుంబంలో నమ్మకం సంపాదించాడు. ఆ తర్వాత వారి రెండో కుమార్తెతో ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత అతని ప్రవర్తనపై అనుమానాలు మొదలయ్యాయి. తరచూ మియాపూర్ ప్రాంతానికి వెళ్తుండటంతో భార్యకు అనుమానం వచ్చి అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించింది. ఫోన్‌లో పలువురు మహిళలతో అతను తీసుకున్న అసభ్య వీడియోలు కనిపించడంతో ఆమె షాక్‌కు గురైంది.
ఈ విషయంపై నిలదీయగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే గ్రామస్తులు అతడిని పట్టుకుని ప్రశ్నించగా, తన అసలు పేరు వేరే అని, తాను వేరే మతానికి చెందినవాడినని, తనకు కుటుంబం కూడా ఉందని అతను ఒప్పుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది. మోసపూరిత సంబంధాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
also read: గండిపేట్ మండల విలేఖరుల టియూడబ్ల్యూజే – ఐజేయూ ఎన్నికలు ఏకగ్రీవం!
