క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ భాయ్ జాన్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు, సినీ వర్గాలకు ఓ ఆసక్తికరమైన వార్త అందించారు. సాధారణంగా ఒక సినిమాకు వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ఈ స్టార్ హీరో, తన తాజా చిత్రం కోసం ఏకంగా రూ.50 కోట్లు తగ్గించుకున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.సల్మాన్ ఖాన్ తన రాబోయే ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. దిల్ రాజు బ్యానర్‌పై, టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. వర్కింగ్ టైటిల్‌గా ‘SVC63’ అని పిలుస్తున్న ఈ సినిమా, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ ఖాన్ రూ.70 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.సాధారణంగా సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగానే తీసుకుంటారు.
ఎర్ర బస్సు కాదు.. ఎయిర్ పోర్టు వచ్చింది… వైసీపీకి కౌంటర్ వేసిన లోకేష్!
అయితే, ఈ సినిమా కథ, దర్శకుడు వంశీ పైడిపల్లి విజన్, నిర్మాత దిల్ రాజు నిర్మాణ విలువలపై ఉన్న నమ్మకంతో సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరో ప్రముఖ నిర్మాత రషి కాజి కూడా ఈ డీల్ వెనుక కీలక పాత్ర పోషించారని సమాచారం.ఈ సినిమాను 2027 రంజాన్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సల్మాన్ ఖాన్ సినిమాలు సాధారణంగా ఈద్ (రంజాన్) సందర్భంగా విడుదలై రికార్డులు సృష్టిస్తుంటాయి. ఈ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ, ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతతో జతకట్టడం, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడం… ఈ అంశాలన్నీ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, తారాగణం, సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
నాని ‘ది ప్యారడైజ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆగస్టు 6న రానున్న భారీ అప్డేట్
