Homeఆంధ్ర ప్రదేశ్ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు కన్నీళ్లొచ్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు కన్నీళ్లొచ్చాయన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- దేశ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాలు చేసిన విమర్శల పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానిని ఉద్దేశించి అన్న మాటలు వింటుంటే తనకు కన్నీళ్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.తన ప్రసంగంలో పవన్ కల్యాణ్ ప్రధాని మోదీకి దేశం పట్ల ఉన్న నిబద్ధతను, ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. “దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీని అనరాని మాటలు అంటుంటే కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తికి మనం ఇచ్చే బహుమతి ఇదేనా?” అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ, ఆయనపై వచ్చే విమర్శలను తిప్పికొట్టారు.”కొత్త తరానికి ఆయన పడ్డ కష్టం, చేసిన త్యాగం ఏం తెలుసు? ఆయనపై ఒక్క మాట పడినా, అది మాపై పడ్డట్లే భావిస్తాం. మోదీ గారిని ఢీకొట్టే నాయకుడు దేశంలో ప్రస్తుతం లేడు, భవిష్యత్తులో కూడా రాబోడు,” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనను విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించిన ప్రధాని మోదీ విశాల హృదయాన్ని ఆయన ప్రశంసించారు. “ఆయన పాదాలకు నా నమస్కారం,” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ పట్ల పవన్ కల్యాణ్ కు ఉన్న గౌరవం, మద్దతు ఈ ప్రసంగం ద్వారా స్పష్టమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం… దిల్ రాజు సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గింపు!

రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి…! హైకోర్టు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు