క్రైమ్ మిర్రర్ : ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా బలగాలు జరిపిన భారీ వైమానిక దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా జరిగిన వరుస దాడులతో కైవ్ నగరంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సుమారు 35 క్షిపణులు, 185 డ్రోన్లను ఉపయోగించి దాడులకు పాల్పడింది. ఈ దాడుల లక్ష్యంగా కైవ్‌లోని పలు ప్రాంతాలు, నివాస భవనాలు, కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
దాడుల తీవ్రత కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో భాగంగానే ఈ తాజా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కైవ్‌పై జరిగిన ఈ దాడిని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.
also read : రణబీర్ ‘రామాయణం’పై భారీ హైప్… ట్రైలర్‌కు ప్రశంసలు, కానీ వ్యూస్‌పై చర్చ!
