చిత్తూరు, క్రైమ్‌మిర్రర్: ప్రియుడిపై మోజుతో భర్త, పిల్లలను వదిలేసి వివాహిత వేరే కాపురం పెట్టింది. మొదట భర్తను చంపాలనుకొని స్కెచ్ వేసి.. తర్వాత మనసు మార్చుకొని పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో రాంగ్ కాల్ ద్వారా శోభకు గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్(22) పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రామ్లో చాట్ ద్వారా మరింత స్నేహం పెరిగిఈ జంట ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి తన భర్త రోజూ కొడుతున్నాడని మొదట అతన్ని హత్య చేసి, ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుందామని భార్య ప్లాన్ వేసింది.
Also Read:ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు…!
తర్వాత మనసు మార్చుకొని నెల రోజుల క్రితం పారిపోయి కుప్పంలో ఓ గుడిలో శోభ, బాలాజీ నాయక్ పెళ్లి చేసుకున్నారు. భర్త తన భార్య శోభ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ క్రమంలో శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించి వారిని భర్త చిరంజీవి తరపు బంధువులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శోభ తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని, ఆమె బలవంతంతో పెళ్లి చేసుకున్నానని ప్రియుడు బాలాజీ నాయక్ తెలిపాడు. తన భర్త రోజూ అనుమానంతో వేధించి కొట్టేవాడని.. ఆ దెబ్బలు చూసి బాలాజీ నాయక్ తన భర్తను చంపుతానంటే వద్దని పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నానని భార్య శోభ అంటోంది. ఈ గొడవను పరిష్కరించలేక పోలీసులు తలలు పట్టుకున్నారు.
Also Read:భారత్ కు జిన్ పింగ్…! సెప్టెంబరులో బ్రిక్స్ సదస్సుకు హాజరు…
