Homeక్రైమ్అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం.. మద్యం దుకాణానికి నిప్పు పెట్టిన వ్యక్తి

అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం.. మద్యం దుకాణానికి నిప్పు పెట్టిన వ్యక్తి

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయిపాలెంలో ఓ వ్యక్తి చిన్న విషయంపై ఆగ్రహంతో మద్యం దుకాణానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది.

స్థానిక సమాచారం ప్రకారం.. అశోక్ అనే వ్యక్తి మద్యం దుకాణంలో అగ్గిపెట్టె అడిగాడు. అయితే సిబ్బంది ఇవ్వకపోవడంతో కోపానికి గురైన అతడు, తన ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీసి దుకాణం వద్ద పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.

మంటలు వ్యాపించడాన్ని గమనించిన దుకాణ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో దుకాణంలో నిల్వ ఉన్న దాదాపు రూ.30 లక్షల విలువైన మద్యం కాలిపోకుండా భారీ నష్టం తప్పింది.

ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: చంపి డ్రమ్ లో వేస్తానని బెదిరించిన భార్య… మానసిక ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు