క్రైమ్ మిర్రర్ : మంచాల మండలం నోముల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన మదరమోని బాబు (తండ్రి: జంగయ్య) కొన్ని నెలల క్రితం భార్య హత్య కేసులో నిందితుడిగా అరెస్టై జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలై గ్రామానికి వచ్చిన బాబు, గ్రామంలోని ఓ బావి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు.
శుక్రవారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాబు మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, విచారణ ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
also read : సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. భర్త వేధింపులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు
