Homeక్రైమ్అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన బస్సు ... 39 మంది యాత్రికులకు గాయాలు

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన బస్సు … 39 మంది యాత్రికులకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గాందర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యాత్రికులతో వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సు అదుపుతప్పిన సమయంలో ఇంటి గోడ అడ్డుగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. లేదంటే బస్సు పక్కనే ఉన్న సింధ్ నదిలో పడిపోయే అవకాశం ఉండేదని తెలిపారు.

ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. యాత్రికుల భద్రతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

also read: “అన్నా లెజినోవా కాదు.. ఇకపై అన్నా కొణిదెలనే పిలవండి”.. పవన్ కళ్యాణ్ భార్య భావోద్వేగ పోస్ట్ వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు