Homeఅంతర్జాతీయంపారిస్‌లో కత్తులతో దాడి .. ‘ అల్లా చెప్పాడని’ నిందితుడి వ్యాఖ్యలు, ఉగ్ర కోణంలో విచారణ

పారిస్‌లో కత్తులతో దాడి .. ‘ అల్లా చెప్పాడని’ నిందితుడి వ్యాఖ్యలు, ఉగ్ర కోణంలో విచారణ

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆందోళనకు గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలపై ఓ వ్యక్తి కత్తులతో దాడి చేయడంతో నగరంలో కలకలం రేగింది. దాడిలో గర్భిణి మహిళ కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రెండు పదునైన కత్తులతో మహిళలపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా అతడు చేసిన వ్యాఖ్యలు అధికారులను అప్రమత్తం చేశాయి. “దైవ ఆదేశాలతోనే ఈ పని చేశాను.. అల్లా పంపాడు.. చేశాను.. ” అంటూ నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఘటనకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడి నేపథ్యం, దాడికి ముందు అతడి కదలికలు, ఉద్దేశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

పారిస్‌లో జరిగిన ఈ ఘటనపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: ఆగస్ట్ 21న ‘ఇరుముడి’ విడుదల: తండ్రీకూతుళ్ల భావోద్వేగ కథతో రవితేజ కొత్త అవతారం

తాజావార్తలు