-
హైడ్రా రంగనాథ్ పై వేటుతో ఆనందం
-
వదులుకునేందుకు ఇష్టపడని రేవంత్ సర్కార్
-
న్యాయ పోరాటం వైపు మొగ్గు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథన్ ను తొలగించాలని ఆదేశించింది. అంతటా ఇది సంచలనంగా మారింది. కానీ ఓ వర్గం మాత్రం ఎక్కువగా సంతోష్ పడుతోంది. బడా ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ ఆక్రమణదారులు తెగ సంతోష పడుతున్నారు.
అయితే అంత ఈజీగా రంగనాథ్ ను వదులుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టపడరు. సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ కు వెళ్లే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే అత్యున్నత న్యాయస్థానం వరకు ఆశ్రయించే ఛాన్స్ కనిపిస్తోంది.
-
హైడ్రా చర్యలతో ప్రకంపనలు..
హైడ్రా రంగంలోకి దిగడం మూలంగా చాలామంది ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రముఖుల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులకు విముక్తి కూడా లభించింది. ఈ క్రమంలో హైడ్రా వ్యవస్థ వారికి వ్యతిరేకంగా కనిపించింది. అన్నింటికీ మించి కమిషనర్ రంగనాథ్ కంటగింపుగా మారారు.
హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువులు, కుంటలు, బఫర్ జోన్లను మింగేసే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అక్రమ నిర్మాణాలు ఎంతటి బడాబాబులువైన హైడ్రా కూల్చివేతలకు వెనుకడుగు వేయలేదు. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చిన రంగనాథ్ పట్టించుకోలేదు. ఇప్పుడు రంగనాథ్ ను తప్పిస్తే ఆ దూకుడు ఉండదు అనేది ఆక్రమణదారుల ఆనందం.
-
తప్పులను సరిదిద్దుకుంటూ..
హైడ్రా చర్యల్లో కొన్ని రకాల తప్పిదాలు జరిగి ఉండవచ్చు. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అవసరమైన సమయాల్లో తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది హైడ్రా. హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణకు, వరద ముంపు నివారణకు ఆ సమస్త నిర్విరామంగా శ్రమిస్తోంది. వర్షాలు పడే సమయంలో క్షేత్రస్థాయిలోకి దిగి తక్షణ సహాయక చర్యలు కూడా చేపట్టింది.
అందుకే హైడ్రా అంటే ప్రజల్లో ఒక రకమైన విశ్వాసం కూడా ఏర్పడింది. హైడ్రా ఉంటేనే మన చెరువులు, భవిష్యత్తు సురక్షితం అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లోకి వెళ్ళింది. ఈ పరిస్థితుల్లోనే రేవంత్ సర్కార్ రంగనాథ్ కు పూర్తిగా అండగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రజాధరణ పొందిన ఒక వ్యవస్థను, దానికి నాయకత్వం వహిస్తున్న అధికారిని పక్కన పెడితే.. అది ప్రభుత్వ ఇమేజ్ కె తీవ్ర విఘాతం కలిగిస్తుంది. అందుకే రంగనాథ్ విషయంలో న్యాయ పోరాటానికి రేవంత్ సర్కార్ మొగ్గు చూపుతోంది. మరి కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
