Homeఆంధ్ర ప్రదేశ్ఘోర రోడ్డు ప్ర‌మాదం...! ముగ్గురు మృతి...

ఘోర రోడ్డు ప్ర‌మాదం…! ముగ్గురు మృతి…

విజయనగరం, క్రైమ్‌మిర్ర‌ర్‌: రెప్ప‌పాటులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిలిచిన ఘ‌ట‌న జయనగరం జిల్లా చెల్లూరు వద్ద చోటు చేసుకుంది. కాగా ప్ర‌మాదంలో ముగ్గురు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా 13 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. కాగా వీరంతాఒడిశాలోని రాయగడ మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మంది ఒడిశాలోని రాయగడ వెళ్లేందుకు ఓ వ్యాన్‌ను బుక్‌ చేసుకున్నారు.

Also Read:అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజు సినిమాలో బిగ్ ట్విస్ట్!

ముందుగా బొచ్చపేట నుంచి బయలుదేరిన ఈ వాహనం, అయినాడ కూడలి వద్దకు చేరుకున్నాక బొడ్డవలసకు చెందిన మరికొంతమంది ఎక్కారు. అనంతరం చెల్లూరు వద్దకు రాగానే వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో అతివేగంగా విశాఖ వైపు నుంచి వస్తున్న ఒక లారీ, ఆగి ఉన్న ఆ వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో మృతులు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొత్సపేటకు చెందిన చింతపల్లి రాంబాబు, మజ్జి నారాయణరావు, బాలుడు బొత్స మోహన్ (8)గా గుర్తించారు.

Also Read:కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాక్!

 

తాజావార్తలు