క్రైమ్ మిర్రర్,విశాఖపట్నం:- ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవం ఇవాళ, రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.నేటి మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచ వద్ద పుష్పరథం ప్రారంభం కానుంది. ఈ గిరిప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఉత్సవం నేపథ్యంలో ప్రదక్షిణ మార్గంలోని 221 పాఠశాలలు, కళాశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించారు.ఈ రెండు రోజుల పాటు ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణలో సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
World Hepatitis Day 2026: ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..!
