ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ, ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ ప్రాజెక్ట్ ‘మిషన్ శక్తిశాట్’కు ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ జెస్సీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జెస్సీ, భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక విద్యార్థినిగా నిలిచింది. ఈ ఎంపికతో ఆమె రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.
పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి పెరిగిందని జెస్సీ తెలిపింది. చిన్ననాటి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకుంటూ, తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్‌గా ఎదగడం తన కల అని వెల్లడించింది.
జెస్సీ సాధన విద్యార్థులందరికీ ప్రేరణగా నిలుస్తోంది. పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి సాధనైనా సాధ్యమేనని ఆమె విజయం మరోసారి నిరూపించింది.
also read: థానేలో షాకింగ్ ఘటన: పోలీస్ లాఠీ లాక్కుని కానిస్టేబుల్‌పై దాడి
