-
సర్ ప్రక్రియతో సమూల ప్రక్షాళన
-
సమాచారం లభించని ఓటర్లు 45 లక్షలు
-
రాష్ట్ర ఓటర్లలో ఇది 10%
-
ఆందోళనలో రాజకీయ పార్టీలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీకి షాకింగ్ పరిణామం. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. క్షేత్రస్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసి డిజిటల్ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతంగా ముగించారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఏపీవ్యాప్తంగా మొత్తం 45 లక్షల మంది ఓటర్లను సమాచారం లభించని వారుగా బిఎల్వోలు ప్రాథమికంగా గుర్తించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 10.74 శాతానికి సమానం. ఇది ఒక విధంగా సంచలనమే. ఎందుకంటే ఈ స్థాయిలో ఓట్లు గల్లంతు అయితే మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలకు ఇబ్బందికరమే. అయితే గత వైసిపి హయాంలో ఇలా ఎక్కువగా ఓట్లు నమోదు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో… కచ్చితంగా ఇది కూటమికి ప్రయోజనం చేకూర్చే అంశమే.
ముసాయిదా ఓటరు జాబితా సిద్ధం…
Also Read:స్నానానికి చల్లటి నీళ్లా? వేడి నీళ్లా? ఏది బెస్ట్! – వైద్యుల సలహా ఇదే
సుదీర్ఘకాలం ఈ సర్ ప్రక్రియ కొనసాగింది. ఈ నెలాఖరున అంటే జూలై జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. అనంతరం అభ్యంతరాలు, చేర్పులు మార్పులకు అవకాశం కల్పించనుంది. విచారణలు ముగించిన తర్వాత అక్టోబర్ మూడున తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తారు. తొలగింపునకు గురవుతున్న వాటిలో అత్యధికంగా రెండు చోట్ల ఉన్న వారిని, మరణించిన వారిని, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లే ప్రధానంగా ఉన్నాయి. ప్రారంభంలో బోగస్ ఓట్ల నమోదు, తొలగింపులపై రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యరోపణలు నడిచాయి. కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. వాస్తవానికి ఈ సర్ ప్రక్రియలో అధికార కూటమితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో పని చేశాయి.
పార్టీలు ఫుల్ ఫోకస్…
Also Read:ఏపీకి వాయుగుండం ముప్పు..ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు – APSDMA హెచ్చరిక
అయితే ఏపీవ్యాప్తంగా ఈ స్థాయిలో లెక్కలోకి రాని ఓట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీల సమర్థవంతమైన పర్యవేక్షణ, బిఎల్వోల కఠిన నిబంధనల కారణంగా.. కేవలం నిర్లక్ష్యం వల్ల ఓటు హక్కు కోల్పోతున్న నిజమైన ఓటర్ల సంఖ్య చాలా తక్కువ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జూలై 31న వెలువడే ముసాయిదా ఓటరు జాబితా ఆధారంగా.. ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదు సరి చేసుకునే వీలు ఉంటుంది. పొరపాటున ఎవరి పేరైనా తొలగిపోతే.. అక్టోబర్ 30న తుది జాబితా వచ్చేలోపు ఫారం 6 ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా డబ్బులు ఎంట్రీ తో పాటు బోగస్ ఓట్లకు చెక్ పెడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్షాళన.. పారదర్శకమైన ఎన్నికలకు బలమైన బాటలు వేస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు. కానీ భారీ స్థాయిలో ఓట్లు గల్లంతు కావడం ఖాయమని తెలుస్తుండడం రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది.
