క్రైం మిర్రర్ : కృష్ణా నదిలో స్నానానికి వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం జూరాల పరిధిలోని కృష్ణా నదిలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం గ్రామానికి చెందిన జాఫర్ (19) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి జూరాల కృష్ణా నది వద్దకు వెళ్లిన జాఫర్ స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం టీజీఎఫ్‌డీ (తెలంగాణ గజ ఈతగాళ్ల బృందం) సిబ్బంది రంగంలోకి దిగి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత జాఫర్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహణ కోసం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికందిన కుమారుడు అకాలంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జాఫర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read : ఇకపై ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి పెడతాం- అభిజిత్ డిప్కే
