-
జూలైలో రాజకీయ ప్రకటన చేస్తానని వెల్లడి
-
బీజేపీలో చేరేందుకు ప్రయత్నం
-
అందుకే మౌనం పాటిస్తున్న మాజీ ఎంపీ
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరుతారు? బిజెపిలో చేరుతారా? లేకుంటే వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా? కొత్త పార్టీని పెడతారా? పొలిటికల్ సర్కిల్స్ లో దీని పైనే చర్చ నడుస్తోంది. తన రాజకీయ ప్రవేశం పై జూలై నెలలో క్లారిటీ ఇస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు జూలై చివరి వారం దాటుతున్నా.. విజయసాయిరెడ్డి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ముఖ్యంగా ఆయన బిజెపిలో చేరుతారన్న ప్రచారాన్ని ఖండించలేదు. ఆ పార్టీకి అనుకూలమైన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
వైసీపీలో ఒక వెలుగు…
Also Read:హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. న్యాయస్థానాన్ని పట్టించుకోరా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా గుర్తింపు పొందారు. అలా ఆ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేశారు సుదీర్ఘకాలం. అయితే అక్రమాస్తుల కేసుల్లో జగన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా నిందితుడిగా మారిపోయారు. 16 నెలల జైలు జీవితం అనుభవించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓడిపోయిన తరువాత విజయసాయిరెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. ఆ పార్టీని విభేదించి గుడ్ బై చెప్పారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ రాజకీయ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల కిందట జూలైలో రాజకీయ ప్రకటన చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జూలై దాటుతున్న ఎటువంటి చప్పుడు లేదు.
ఆ రెండు పార్టీల అభ్యంతరాలతో…
Also Read:వైరల్ లేఖపై క్లారిటీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త పూర్తిగా ఫేక్!
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు విజయసాయిరెడ్డి గట్టి ప్రయత్నాలు చేసినట్లు అర్థం అవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీకి భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి టిడిపి, జనసేన. ఆ పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో బిజెపి వెనక్కి తగ్గింది. అయితే ఇంతలో మీడియా రంగంలో అడుగు పెట్టాలనుకున్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాదులో ఓ పాత టీవీ ఛానల్ కొనుగోలు చేసేందుకు బేరం ఆడారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అందుకే డిజిటల్ మీడియా ఏర్పాటులో తల మునకలై ఉన్నారు. అది కొలిక్కి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
వైసీపీలో అవకాశం లేనట్టే…
Also Read:ఒకే వరుడికి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పెళ్లి… అమ్రోహాలో వైరల్ అయిన విభిన్న వివాహ వేడుక
మరోవైపు విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రచారంలో ఉంది. ఎంతో ప్రాధాన్యత ఇస్తే విజయసాయిరెడ్డి కష్టకాలంలో ఉండగా రాజ్యసభ పదవిని వదులుకొని మరి బయటకు వెళ్లిపోవడాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక ఆప్షన్ బిజెపి. ఎందుకంటే సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే శక్తి, యుక్తి విజయసాయిరెడ్డికి లేదు. అందుకే టిడిపి కూటమికి సహకరించేందుకు విజయసాయిరెడ్డి మనస్ఫూర్తిగా ముందుకు వస్తే మాత్రం ఆయనకు బిజెపిలో చేరేందుకు ఛాన్స్ దొరుకుతుంది. అది కూడా చంద్రబాబు, పవన్ సమ్మతిస్తేనే సాధ్యం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి