క్రైమ్ మిర్రర్,పాలిటిక్స్:- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలోనూ, పలు వార్తా మాధ్యమాల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు.
అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని, అందులో ఎలాంటి నిజం లేదని శరత్ చంద్ర నాయుడు తేల్చి చెప్పారు. అవన్నీ పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు.ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా సినిమాలపైనే ఉందని ఆయన మేనేజర్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో ఒకరని, ఆయన చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో తన కెరీర్ ని, సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఆయనకు ఏముందని శరత్ చంద్ర నాయుడు ప్రశ్నించారు.అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు. ఆ ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
వైసీపీలోకి ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు…?
బస్టాండ్‌లో ఘోర విషాదం.. రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి