-
కొత్తగూడెం పై పొంగులేటి కన్ను…!
-
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి చెక్ పెట్టే ప్రయత్నం
-
అవినీతి, అసమర్ధ ముద్ర వేసి సైడ్ చేసే వ్యూహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం సీటుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారా? వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీకి సిద్ధపడుతున్నారా? సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనమనేనికి చెక్ పెడుతున్నారా? సిపిఐ తో పొత్తు లేకుండా చేయాలనుకుంటున్నారా? దీనిపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తో పాటు బరిలో దిగింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. అందుకు కారణం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. సిపిఐ తో పొత్తు ఉంటే కొత్తగూడెం సీటు ఆ పార్టీకి వెళ్లిపోతుందని భావించి.. పొత్తుకు విఘాతం కలిగించే ప్రయత్నంలో ఉన్నారు అట పొంగులేటి. అయితే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారని హై కమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా సిపిఐకి…
Also Read:మిడ్‌డే మీల్‌లో తేలు కలకలం.. 100కి పైగా విద్యార్థులు అస్వస్థత, బీహార్‌లో ఆందోళన
గత ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధపడ్డారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కానీ ఖమ్మం జిల్లాలో సిపిఐ కు బలం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ సిపిఐ తో పొత్తు పెట్టుకుంది. కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సిపిఐ కోరుకోవడం తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయలేకపోయారు. పాలేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కొత్తగూడెం పై మాత్రం మనసు వదులుకోలేదు. కొత్తగూడెంలో మంత్రిగా పర్యటనలు చేస్తూ.. మళ్లీ రాజకీయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావుకు మాత్రం ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు.
కూటమి ఘనవిజయం…
Also Read:పదవిలో హోదా.. పనిలో సాదాసీదా.. విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ హరిత
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ తో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రెండు పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఒక్క భద్రాచలం మినహాయించి మిగతా 9 అసెంబ్లీ నియోజకవర్గం కైవసం చేసుకుంది. మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉండగా.. మూడు మాత్రమే జనరల్ సీట్లు ఉన్నాయి. అందులో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం నుంచి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
. తప్పిన వ్యూహం…
Also Read:హనీమూన్ హత్య కేసు: సోనమ్‌కు బెయిల్ రద్దు, 3 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
మున్సిపల్ ఎన్నికల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సరి కొత్త రాజకీయానికి తెర తీశారు. అయితే హై కమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కంట్రోల్ చేసింది పార్టీ. అప్పటినుంచి కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు కొత్తగూడెం పై మళ్లీ దృష్టి పెట్టారు. అందులో భాగంగానే తన వియ్యంకుడు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూనం నేనికీ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించినట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు తరచూ కొత్తగూడెంలో పర్యటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా కూనంనేని పై అవినీతి, అసమర్ధముద్రవేసి ఆ సీటు సీపీఐ నుంచి తప్పించాలని పొంగులేటి భావిస్తున్నట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై సిపిఐ నేత కూనంనేని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే కొత్తగూడెం వివాదం ఇప్పుడు సరికొత్త హార్ట్ టాపిక్ అవుతుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో.